చాగలమర్రి మండలం, నగళ్లపాడు గ్రామానికి చెందిన ప్రణయ్ కుమార్ రెడ్డి ( 4 ) అనే బాలుడు బుధవారం రాత్రి పాము కాటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన రవికుమార్ రెడ్డి కుమారుడు ప్రణయ్ కుమార్ రెడ్డి చాగలమర్రిలోని ఓ పాఠశాలలో ఎల్ కే జీ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటి ఆవరణంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై మృతి చెందాడు.