ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప నగర్ లో వెలసిన శ్రీ కాళికామాత ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని కాళికా మాత ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు దురుగడ్డ అనురాధ ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ ఆచారి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం అనంతరం అమ్మవారిని వరలక్ష్మి దేవి గా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.