శిరివెళ్ళ మండలం గోవిందపల్లె గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1998-99 సంవత్సరం పదవ తరగతి విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా 26 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా , సంతోషంగా గడిపారు. పూర్వ విద్యార్థులు తమకు విద్యను బోధించిన నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.