ఆస్పరి మండల కేంద్రంలో బుధవారం బిజెపి ఆస్పరి మండల అధ్యక్షులు అర్పణ నరసప్ప విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వికసిత భారత్ బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు, మహిళలకు, రైతులకు, చిన్న చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకున్న వారందరికీ ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది అని అన్నారు.