క్రీడాదాత మాజీ ఎంపీ. టీజీ వెంకటేష్ క్రీడారంగానికి చేసిన సేవలు మరపు రాణివని జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు బొల్లారం రామాంజనేయులు కొనియాడారు. శుక్రవారం కర్నూలు టీజీ నివాసంలో కలిసి సంఘ క్రీడా నేతలు మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్, రగ్బీ, హ్యాండ్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, రైఫిల్ షూటింగ్, పవర్ లిఫ్టింగ్, శిలంబం, ఫుట్‌బాల్ వంటి క్రీడాంశాలకు సంబంధించినవి ప్రతినిధులు పాల్గొని కరచాలనంతో శుభాకాంక్షలు తెలిపారు.