ఆలూరు - గుంతకల్లు రహదారిపై కల్వర్ట్ పనుల నిమిత్తం వేసిన మట్టి వర్షంలో కొట్టుకుపోయి ట్రాక్టర్, బస్సు చిక్కుకున్నాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం గుంతకల్ నుంచి ఆదోని వెళ్లే దారిలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సమస్యపై అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.