బనగానపల్లె మండలంలో వెలుగు ఏపీఎంగా ఉన్న డాక్టర్ అడ్డాకుల శ్రీనివాసులు సస్పెన్షన్ కావడంతో చంద్రశేఖర్‌ను ఇన్‌చార్జ్ ఏపీఎంగా నియమించారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేసే బాధ్యత తమపై ఉందన్నారు. మహిళల అభివృద్ధికి వెలుగు కార్యాలయాల ద్వారా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.