బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల జనసేన కార్యాలయంలో శుక్రవారం సభ్యత్వ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన బీమాతో కూడిన ఈ ఐడీ కార్డులను నియోజకవర్గ నాయకులు భాస్కర్, దొడియం గురప్ప, నాగ ప్రసాద్, కిట్టు తదితరులు వాలంటీర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.