బనగానపల్లె: విఘ్నేశ్వర్ అక్రమ అరెస్ట్‌పై మండిపడ్డ కాటసాని

72చూసినవారు
బనగానపల్లె: విఘ్నేశ్వర్ అక్రమ అరెస్ట్‌పై మండిపడ్డ కాటసాని
బనగానపల్లె నియోజకవర్గంలో చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుక్రవారం తీవ్రంగా ఖండించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. హత్యాయత్నం కేసులో బనగానపల్లె సమీపంలో అరెస్ట్ చేసి బేతంచెర్లకు తరలించారని తెలిపారు. ఇప్పటి వరకు వందమందిని అక్రమంగా అరెస్ట్ చేశారనీ, టీడీపీ నేతలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్