బేతంచర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం శివారాలలో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామిలో పుష్య మాస శనివారం సందర్భంగా ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నాలుగు మూలల నుండి భక్తులు తరలివచ్చి కోనేటిలో పుణ్యస్నానాలు చేసి స్వామి అమ్మవార్లకు కుంకుమార్చన పంచామృత అభిషేకం మహా మంగళ హారతి నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.