డోన్: మే 19న టీడీపీ మినీ మహానాడు

65చూసినవారు
డోన్: మే 19న టీడీపీ మినీ మహానాడు
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మే 19 సోమవారం ఉదయం 10 గంటలకు డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్‌లో టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరగనుంది. ఈ సమావేశం పార్టీ భావజాలాన్ని బలోపేతం చేయడమే కాక, భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయనుందని శనివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. డోన్, బేతంచేర్ల, ప్యాపిలి మండలాల నేతలు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్