గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడితే చర్యలు తప్పవు

84చూసినవారు
గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడితే చర్యలు తప్పవు
గూడూరు మండలంలోని గ్రామాల్లో ఎవ్వరైనా ఘర్షణలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హనుమంతయ్య హెచ్చరించారు. ఆదివారం గూడూరు పోలీసుస్టేషన్ పరిధిలోని గుడిపాడు, చనుగోండ్ల గ్రామాల్లో ఎస్సై హనుమంతయ్య పోలీసు సిబ్బందితో పర్యటించి, గ్రామస్తులతో మాట్లాడారు. పోలింగ్, కౌటింగ్ అనంతరం గ్రామాల్లో ఘర్షణల జోలికి వెళ్ళకుండా అందరూ కలిసి మెలసి సఖ్యతతో మెలగాలన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్