ప్రతిఒక్కరూ ప్రశాంత జీవనం అలవర్చుకోవాలని, గొడవలకు దూరంగా ఉండాలని కోడుమూరు ఎస్సై ఏపీ శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం మండలంలోని లద్దగిరి గ్రామంలో ఎస్సై పర్యటించారు. అనంతరం ప్రజలతో ఎస్సై మాట్లాడారు. ఘర్షణ లకు పాల్పడొద్దని, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. అప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోతే పోలీసులను ఆశ్రయించాలని చెప్పారు.