ఆలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

64చూసినవారు
కోడుమూరు పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న శ్రీధర్మపురి ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ధర్మపురి అయ్యప్పస్వామి ఆలయం తరుపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల గురించి వక్తలు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్