ఆదివారం కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి జిల్లా యూత్ అధ్యక్షులు సిరిగిరి మద్దిలేటీ (మద్ది ) కలిసి వినతి పత్రం సమర్పించారు. కోడుమూరు టౌన్ లక్ష్మీనగర్ లో బేడ బుడగ జంగాల స్థితిగతులను వివరిస్తూ తాము ఎదుర్కొంటున్న కుల సర్టిఫికెట్ లేక ప్రభుత్వ పథకాల అందక పడుతున్న ఇబ్బందులను సమస్యలని క్లుప్తంగా వివరించారు.