పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రజలకు గౌరవం ఇచ్చి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోడుమూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, గ్రామాల వివరాలు, కేసులపై కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్సై శ్రీనివాసులుతో ఆరా తీసిన ఆయన, విధుల్లో సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.