
ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యూయార్క్ వెళ్లిన సాయికుమార్‌రెడ్డి చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. ట్రంప్ డిపోర్టేషన్ పేరుతో అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు తిప్పి పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పనిచేసే చోట అమెరికా అధికారులు తనిఖీలు నిర్వహించి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. డిపోర్ట్ చేస్తారని భయంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.