కోడుమూరు: ఎస్సైపై టీడీపీ నాయకులు సీఐకి ఫిర్యాదు

57చూసినవారు
కోడుమూరు: ఎస్సైపై టీడీపీ నాయకులు సీఐకి ఫిర్యాదు
గూడూరు ఎస్సై తిమ్మయ్య మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకోని వదిలేస్తున్నారని టీడీపీ నాయకులు చరణ్ కుమార్ సీఐ తబ్రేజ్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం గూడూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన సీఐతో మాట్లాడారు. సీఐ ఎదుటే ఎస్సై, టీడీపీ నేత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగంగా మద్యం తాగుతున్న వ్యక్తుల నుంచి రూ. 2, 500 మామూళ్లు ఎస్సై వసూలు చేశారంటూ చరణ్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్