
దేశంలోనే ఫస్ట్ టైం.. AIతో నారింజ సాగు
మహారాష్ట్రలో అమరావతి జిల్లా యువరైతు గౌరవ్ బిజ్వే దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత నారింజ సాగు చేపట్టారు. ఖార్పి గ్రామానికి చెందిన ఆయన 8 ఎకరాల్లో ఉన్న 1,200 నారింజ చెట్లను ఇంటి నుంచే మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రూ.60,000 ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ వాతావరణం, నేల, చెట్ల ఆరోగ్యం, చీడపీడలను ఏఐ సెన్సర్లు ట్రాక్ చేస్తున్నాయి. దీంతో క్రిమిసంహారకాలు, నీటి వినియోగం తగ్గిందని రైతు చెప్తున్నారు.