కోడుమూరు నియోజకవర్గం సి. బెళగల్ మండలం లో వైసీపీ ప్రభుత్వంలో డ్రైనేజీ, సీసీరోడ్డు, హౌసింగ్, ఎస్సీ, బీసీ, మైనార్టీల కార్పొరేషన్లలో ఏ అభివృద్ధి జరగలేదని సీ. బెళగల్ మాజీ జడ్పీటీసీ సభ్యులు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన సి. బెళగల్ లో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని, కోడుమూరులో ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని ఆదరించాలన్నారు.