కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడు గ్రామం అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు ప్రతాప్ గురువారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ దిన్నెదేవరపాడులో ప్రతాప్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సి. బెళగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.