ఈనెల 17, 18 తేదీల్లో కదిరిలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ కు జిల్లా జట్టు పయనమైంది. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొని క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు.