ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ శనివారం కర్నూలుకు రానున్నారు. ఆయన హైదరాబాదు నుంచి రోడ్డు మార్గం ద్వారా 4వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలు చేరుకుంటారు. అనంతరం దిన్నెదేవరపాడులోని విద్యుత్ నియంత్రణ భవన్ చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత 2 గంటలకు కర్నూలు నుంచి హైదరాబాదుకు తిరిగి ప్రయాణమవుతారని గురువారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు.