కర్నూలు త్రీటౌన్ పోలీసులు శనివారం కడపలో అదనపు కట్నం కోసం వేధించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కర్నూలుకు చెందిన షేక్ మన్జూర్ అహ్మద్ కూతురు షేక్ సుమయాను అదనపు కట్నం కోసం వేధించినందుకు షేక్ కరీముల్లా బాషా, షేక్ నసీంభాను, అరాఫత్ ను అరెస్టు చేశారు. ఈ విషయమై షేక్ సుమయా తండ్రి గత డిసెంబర్ 11న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుతో అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.