ఆదోనిలో బీజేపీలోకి 100 మంది వైసీపీ కార్యకర్తలు చేరిక

72చూసినవారు
ఆదోనిలో బీజేపీలోకి 100 మంది వైసీపీ కార్యకర్తలు చేరిక
ఆదోనిలోని అరుణ జ్యోతి నగర్కు చెందిన వైసీపీ కార్యకర్తలు సుమారు 100 మంది ఆదివారం బీజేపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్థసారథి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఆలోచనా విధానం, ఆదోని అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం చూసి పార్టీలో చేరామని వారు తెలిపారు. కార్యక్రమానికి అరుణ జ్యోతి నగర్ బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్