పేకాట రాయుళ్ల అరెస్ట్: ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి

79చూసినవారు
పేకాట రాయుళ్ల అరెస్ట్: ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి
కౌతాళం మండలం కామవరం-పెద్దతుంబలం మధ్య ఉన్న రిజర్వ్ ఫారెస్టులో పేకాట ఆడుతున్న వ్యక్తులను బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. కుప్పగల్కు చెందిన మల్లికార్జున, తిమ్మా రెడ్డి, తలారి తిరుమల, పెద్దతుంబలానికి చెందిన ఖాశీమయ్య, మక్బూల్ బాషా, అబ్దుల్లాను పట్టుకుని, వారి నుంచి రూ. 19, 170 నగదు, 8 సెల్ ఫోన్లు, 6 బైకులను స్వాధీన చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్