పేదలకు సేవ చేసేందుకు మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నానని, మీ బిడ్డకు ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి కోరారు. బుధవారం మంత్రాలయం నియోజకవర్గంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో రాఘవేంద్రరెడ్డి సోదరులు దూసుకుపోతున్నారు. ఒక వైపు అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, ఇంకొవైపు సోదరుడు రామకృష్ణారెడ్డి, మరోవైపు ఇంకో సోదరుడు రఘునాథ్ రెడ్డి ప్రజలను కలిసి టీడీపీకి ఓటు వేయాలని కోరుతున్నారు.