ఎడారిగా మారిన తుంగభద్ర నది

56చూసినవారు
ఎడారిగా మారిన తుంగభద్ర నది
వర్షాభావం వల్ల తుంగభద్ర నది ఎడారిగా మారింది. మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం నదిచాగి పంచాయతీ పరిధిలో తుంగభద్ర నది ఆంధ్రలో ప్రవేశిస్తుంది. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటివరకు నదిలో నీళ్లు లేక ఎడారిగా మారింది. నది తీరాన ఉన్న రైతులు వరి సాగు కోసం నారుమళ్లు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఆనకట్ట పైభాగాన వర్షాభావంతో నీటి నిల్వ గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని డ్యాం అధికారులు బుధవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్