అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం పలికారు.