గోనెగండ్ల: ఖరీఫ్ సాగుపై గంపెడు ఆశలు.. రైతులకు కన్నీరు

74చూసినవారు
గోనెగండ్ల: ఖరీఫ్ సాగుపై గంపెడు ఆశలు.. రైతులకు కన్నీరు
జూన్ మాసంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సంతోష పడిన రైతులంతా పత్తి పంటను సాగు చేశామని, జూలై మాసం వారం గడిచిన వరునుడి జాడ లేదని పత్తి పంట ఎండిపోతుందని గోనెగండ్ల మండలం రైతు హనుమంతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఖరీఫ్ సీజన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన సరైన వర్షాలు లేక కుంగిపోతున్నానన్నాడు. మరోవైపు భూగర్భ జలాలు ఎండిపోవడం, వర్షాలు పడకపోవడంతో పెట్టుకున్న ఆశలు ఆవిరి అవుతున్నాయని ఆవేదన చెందాడు.