టీడీపీ నేత ఉలిగయ్యకు ఘన సన్మానం

69చూసినవారు
టీడీపీ నేత ఉలిగయ్యకు ఘన సన్మానం
కౌతాళం మండలంలోని గోతులదొడ్డిలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్యను కౌతాళం మండలంలోని వివిధ గ్రామాల్లో పని చేసే ఐకేపీ బుక్ కీపర్లు ఆయన స్వగృహం నందు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉలిగయ్యకు బుక్ కీపర్లు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. బుక్ కీపర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్