ఎమ్మెల్యే ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు

75చూసినవారు
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పెద్దకడబూరు మండల సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని టీడీపీ మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న అన్నారు. గురువారం పెద్దకడబూరులో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉంటేనే ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ గుర్తుకొస్తుందా, అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఏమయిందని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులను బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్