ఖైదీల్లో సత్ప్రవర్తన పెంపొందించేందుకు జైల్ అధికారులు: ఎంపీ

66చూసినవారు
ఖైదీల్లో సత్ప్రవర్తన పెంపొందించేందుకు జైల్ అధికారులు: ఎంపీ
జైలు జీవితం గడుపుతున్న వారిలో మానసిక ఆందోళనను దూరం చేస్తూ, వారిలో సత్ప్రవర్తనను పెంపొందించేందుకు వీలుగా జైల్ అధికారులు కృషి చేయాలని కర్నూలు ఎంపీ నాగరాజు కోరారు. ఎంపీ హోదాలో మొదటిసారి జిల్లా జైలును ఆయన బుధవారం సందర్శించారు. వివిధ కేసుల్లో శిక్ష పడిన ఖైదీలను కలిసి జైలులో వారికి అందిస్తున్న భోజనం, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏ కేసుల్లో జైలుకు వచ్చారని ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్