వ్యవసాయ అనుబంధ సిబ్బందికి న్యాయం చేయాలి: ఎంపీఈఓలు

76చూసినవారు
వ్యవసాయ అనుబంధ సిబ్బందికి న్యాయం చేయాలి: ఎంపీఈఓలు
సీ. బెళగల్: వ్యవసాయ అనుబంధ సిబ్బంది సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎంపీఈఓలు డిమాండ్ చేశారు. బుధవారం టీడీపీ జిల్లా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి వినతులిచ్చారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఎంపీఈఓలుగా నియమించిందన్నారు. అయితే వేతనం రూ. 12 వేలతో కుటుంబం గడవడం కష్టంగా ఉందని అనేక మార్లు ఉద్యమించినా స్పందన లేదని ఆవేదన చెందారు. కార్యక్రమంలో ఎంపీఈఓలు వెంకటేశ్వర్లు, సుమతి, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్