పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో డ్రైనేజీలు నిండి రోడ్లపైకి మురికి నీరు పారుతున్న ఎండిఓ జయరాముడు, పంచాయతీ కార్యదర్శి శేషన్న నిర్లక్ష్యం వహిస్తున్నారని గురువారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈ. తిక్కన గౌడ్ అన్నారు. గ్రామంలో దాదాపు 5000 కుటుంబాలు ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు మబ్బు నిద్ర విడి పూడిక తీయించాలని లేకపోతే సిపిఎం పార్టీ తరఫున భారీ ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.