జనవరి 5న విజయవాడలోని కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే హైందవ శంఖారావానికి పెద్దకడబూరు నుంచి శనివారం ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి జెండా ఊపి యువతను పంపారు. పార్టీలతో సంబంధం లేకుండా దేవాలయాలు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ సభకు తరలి వెళ్లాలని వారు పిలుపునిచ్చారు.