బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలి

60చూసినవారు
బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలి
కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయంలోని బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ ఉపాధ్యాయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం కేజీబీవీని ఆమె సందర్శించి తరగతి గదిలో విద్యార్థినీలతో మాట్లాడారు. విద్యాలయంలో పిల్లలకు కల్పిస్తున్న సౌకార్యాలపై, అందిస్తున్న ఆహారంపై అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. చదువుతోపాటు సంస్కారం కూడా చాలా ముఖ్యమని హితవు పలికారు.

ట్యాగ్స్ :