మంత్రాలయంలోని పోస్టల్ రాఘవులు శనివారం పదవి విరమణ చేశారు. రాఘవులకు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్రరెడ్డి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. రాఘవులకు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. తపాలా శాఖలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని నిజాయితీగా పని చేస్తూ తోటి ఉద్యోగుల మన్ననలు పొందారని కొనియాడారు. అశోక్ రెడ్డి, వరదరాజు, రఘు నరసింహ, డేనియల్, శివ డేవిడ్, మధు పాల్గొన్నారు.