సీనియర్ కళాకారులు సర్విశెట్టి శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి

67చూసినవారు
సీనియర్ కళాకారులు సర్విశెట్టి శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి
కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సర్విశెట్టి శ్రీనివాసులు(79) శనివారం కర్నూలులోని తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. సర్విశెట్టి శ్రీనివాసులు కర్నూలు జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేశారు. ఆయన కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి ఎందరో నూతన కళాకారులను తీర్చిదిద్దారు. ఆయన భౌతికకాయాన్ని రంగస్థల సీనియర్ కళాకారులు సిహెచ్. చంద్రన్న సందర్శించి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్