రైతాంగ సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

52చూసినవారు
రైతాంగ సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి
ఓర్వకల్లు, కల్లూరు మండలాల రైతాంగ సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిని కోరారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన చరితా రెడ్డిని ఆదివారం వారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం ఓర్వకల్లు, కల్లూరు మండలాల రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేసిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్