మంత్రాలయం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో
టీడీపీ జెండా ఎగరడం ఖాయమని నియోజకవర్గ పరిశీలకురాలు శివబాల ధీమా వ్యక్తం చేశారు. శనివారం పెద్దకడబూరులోని
టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్వగృహంలో జరిగిన
టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.
టీడీపీ అధినేత చేపట్టిన ప్రతి ప్రోగ్రాం మంత్రాలయం నియోజకవర్గంలో విజయవంతం అయిందని, ఇందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.