ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించాలి: యూటీఎఫ్ నవీన్

65చూసినవారు
ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించాలి: యూటీఎఫ్ నవీన్
విద్యా రంగంలో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ పాటి మంగళవారం ఆదోనిలో తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ సమస్య, నూతన అప్గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు పోస్టుల మంజూరు, బదిలీలు, ప్రమోషన్లు, కల్పించాలన్నారు. మున్సిపల్ పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టుల సర్దుబాటు, జీవో నెంబర్ 117 తక్షణం రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్