పగిడ్యాల మండలంలోని మచ్చుమర్రి గ్రామంలో 8 ఏళ్ల చిన్నారి వాల్మీకి వాసంతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే ఉరి తీయ్యాలని గురువారం పెద్దకడబూరులో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాయకులు బసలదొడ్డి ఈరన్న, దశరథ రాముడు, తలారి అంజీ, మొట్రు ఈరన్న, ఓబులేష్, రంగస్వామి, హనుమన్న, వెంకటేశ్వర్లు గ్రామ పురవీధుల గుండా నిందితులను ఉరి తీయాలని నినాదాలు చేశారు.