ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలో క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లాలోని వివిధ సమస్యలపై చర్చించారు. మంత్రాలయం నియోజకవర్గ సమస్యలుపైన చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప ధని తదితరులు పాల్గొన్నారు.