ఎమ్మిగనూరు తాగునీరు ప్రవహించే ఎల్ఎల్సీసీ ప్రధాన కాలువలో వ్యర్థ పదార్థాలు పడి ఉండటాన్ని ఎమ్మిగనూరు సీపీఐ నాయకులు తప్పు పట్టారు. త్వరలోనే ఎల్ఎల్సీ కాలువకు నీరు వదులుతున్న నేపథ్యంలో కాలువలో ఉన్న వ్యర్థాలను తీసి కాలువకు ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించాలని పట్టణ కార్యదర్శి రంగన్న డిమాండ్ చేశారు. కాలువలో ప్రవహించే నీటిని గ్రామీణ ప్రజలు ప్రతిరోజూ తాగడానికి ఉపయోగిస్తారని అన్నారు.