అమరావతిలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పల్లె ప్రగతికి పంచాయతీరాజ్ శాఖ కీలకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్, అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.