78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో శాసనసభ్యులు గిత్త జయసూర్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.