అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ముడి పెట్టకుండా తక్షణమే విడుదల చేయాలని, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు పిక్కిలి. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం నందికొట్కూరులోని కోటవీధిలో ఉన్న పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కాటేపోవు సోమన్న అధ్యక్షతన వహించారు. మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్. బిబి, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.