జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో కౌలు రైతులకు కౌలు ధ్రువీకరణ పత్రాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి బి. కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఈ పత్రాలు అన్నదాత సుఖీభవ, పంట భీమా, నష్టపరిహారం, పంట రుణాలకు ఉపయోగపడతాయన్నారు. రైతులు గ్రామ రెవిన్యూ అధికారికి దరఖాస్తు చేయాలని తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించారు.