నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ ఫారం భూములను విత్తన అభివృద్ధి కేంద్రంగా ఏర్పాటు చేయాలని శుక్రవారం సిపిఐ, రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. మొత్తం 1634 ఎకరాల భూమిని ఇతర సంస్థలకు అప్పగించకుండా రైతుల అవసరాల కోసం వినియోగించాలన్నారు.